గ్రామ రహదారి అధ్వాన్నంగా మారి.. ప్రయాణం చేయటానికి వీల్లేకుండా గోతులు పడ్డాయి. ఈ విషయంపై అధికారులు చుట్టూ తిరిగినా లాభం లేదు. దీంతో ఆ గ్రామ యువతే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి తగిన సాయం వారు చేసి కొంత నగదును సమకూర్చుకొని.. రహదారి సమస్యను పరిష్కరించుకున్నారు. వారే శ్రీకాకుళం జిల్లా మాధవరాయిపురం గ్రామ యువత.
మాధవరాయిపురం గ్రామ ప్రధాన రహదారి గోతులు పడటంతో.. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రహదారిని బాగుచేయాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. దీంతో గ్రామ యువత సమస్యను పరిష్కరించుకోవటానికి.. ఐక్యంగా ముందుకు వచ్చి కొంత నిధులు సమకూర్చుకొని రహదారిని బాగు చేసుకున్నారు.
ఇదీ చదవండి: పేకాట శిబిరంపై దాడి.. పోలీసుల అదుపులో 10 మంది