శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పరిధిలోని గ్రామాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. మండలంలోని 18 గ్రామాల్లో రెడ్‌జోన్ ప్రాంతాలున్నాయి. మరో 9 గ్రామాల్లో కంటైన్మెంట్ అమలు జరుగుతుంది. మేజర్ పంచాయతీ వీధుల్లో ప్రజలు ప్రవేశించకుండా ఉండేందుకు రహదారిపై కర్రలు కట్టారు.
ప్రధాన రహదారిపై సైతం ప్రజలు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి సామాజిక ఆసుపత్రిలో.. స్థానికులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనుమానితంగా ఫలితాలు వచ్చిన వారిని శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు.
ఇదీ చదవండి: