శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం కొండవలస పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. తుమ్మి వెంకటరమణ విజయం సాధించినట్లు.. రిటర్నింగ్ అధికారి ప్రకటించగా.. వైకాపా నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తంచేస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు.. కొన్ని బ్యాలెట్ పెట్టెల్ని అపహరించుకెళ్లారు. ఒక బాక్సుకు నిప్పుపెట్టగా. మిగతా పెట్టెల జాడ తెలియలేదు. పోలింగ్ అధికారులను నిరసనకారులు కదలనీయలేదు. పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. కొందరికి వాతలు తేలాయి.
జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్‌కుమార్.. కొండవసలకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. అర్ధరాత్రి రెండు గంటల వరకూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రీపోలింగ్‌కు..వైకాపా శ్రేణులు డిమండ్ చేయగా.. ఎత్తుకెళ్లిన బ్యాలెట్ పెట్టెలు ఎక్కడున్నాయో చెప్తేఏం చేయాలో నిర్ణయిస్తామని జేసీ తేల్చి చెప్పారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి దృష్ట్యా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. వారు ఎన్నికల సిబ్బందిని బస్సుల్లో.. అక్కడ నుంచి తరలించారు. గ్రామస్తులు ఎంతకీ ఆందోళన విరమించక పోవడంతో.. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్