ETV Bharat / state

ఏపీలో అమలవుతున్న సంక్షేమం.. ఇంకెక్కడైనా ఉందా?: సభాపతి తమ్మినేని - anahrapradhesh latest news

ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి అందరూ తోడుగా నిలవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni seetharam) అన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా బురిడివలస, పెద్దపాలెం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కృష్ణా జిల్లా ఉప్పులూరులో ఇళ్ల శంకుస్థాపనకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనలు

author img

By

Published : Jul 3, 2021, 5:23 PM IST

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా... శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బురిడి వలస, పెద్దపాలెం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి 31 లక్షల ఇళ్లను అందిస్తున్నారని సీతారాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా.. అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీతారాం అన్నారు. ప్రతి గ్రామంలో పాల శీతల కేంద్రాల ఏర్పాటుతో మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల నిర్మాణంలో ఉన్న లోటుపాట్లను గమనించి, సంబంధిత అధికారులతో సమీక్షించి దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అసెంబ్లీ స్పీకర్ అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి మనం ఎల్లవేళలా తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.

వెంకటగిరిలో...

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. పుర పరిధిలో పేదలకు కేటాయించిన లే-ఔట్ లో సామూహిక గృహ నిర్మాణ పనులకు భూమి పూజలు నిర్వహించారు. అనంతరం హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్​మెంట్ కళాశాల స్థాపనకు స్థల సేకరణకు పరిశీలించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందన.. నివేదిక ఇవ్వాలని సీఎస్​కు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.