ETV Bharat / state

'20 ఏళ్లుగా ఉన్న పార్టీ కార్యాలయంలోకి వెళ్లనివ్వరా?' - Srikakulam District Latest news

పొందూరులో తెదేపా నేత కూన రవికుమార్ పర్యటించారు. పోలీసులు భారీగా మోహరించారు. గతంలో తెదేపా మండల పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన మోహన్​రావు ఇటీవల వైకాపాలో చేరారు. అయితే తెదేపా మండల పార్టీ కార్యాలయం మోహన్ రావు సొంత భవనం కావడం వల్ల ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాారు.

Kuna Ravikumar fires on Jagan Over attacks
కూన రవికుమార్
author img

By

Published : Sep 30, 2020, 7:24 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్​ను అధినేత చంద్రబాబు నియమించారు. ఆయన బుధవారం తన సొంత నియోజకవర్గం పొందూరులో పర్యటించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం అవుతారని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు.

పొందూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన గుడ్ల మోహన్ రావు ఇటీవల తెదేపా నుంచి వైకాపాకి వెళ్లారు. ఇంతవరకు మోహన్​రావుకు చెందిన సొంత భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాకలాపాలు నిర్వహించేవారు. మోహన్ రావు పార్టీ మారిన అనంతరం.. కార్యాలయం భవనం వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. భవనం ఖాళీ చేయించే విషయంలో కూన రవికుమార్, మోహన్​రావుకు సంబంధించిన ఫోన్ సంభాషణ విషయంలో వివాదం నెలకొంది.

కూన రవికుమార్ వలన తనకు ప్రాణహాని ఉందని మోహన్ రావు గతంలో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫలితంగా.. పోలీసులు రవికుమార్​ను అరెస్ట్ చేశారు. మరలా వివాదం పునరావృతం అవుతుందని భావించిన పోలీసులు పార్టీ కార్యాలయం వద్ద ముందస్తుగా మొహరించారు. ఈ కారణంగా... పొందూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కూన రవికుమార్​కు ఘన సన్మానం...

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షునిగా నియమితులయ్యాక తొలిసారిగా పొందూరు మండలానికి వచ్చిన కూన రవికుమార్​ను పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా సత్కరించారు. తొలుత కూన రవికుమార్ పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది...

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని కూన రవికుమార్ ఆరోపించారు. 20 ఏళ్లుగా ఉన్న పార్టీ కార్యాలయంలోకి వెళ్లకుండా రెండు వందల మంది పోలీసులతో మోహరించడంపై మండిపడ్డారు. వైకాపా వచ్చిన తర్వాత మద్యం ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.

ఇదీ చదవండి:

భావితరాలూ ఈ అప్పులను తీర్చలేరు: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.