పశ్చిమ బంగా ఖరగ్‌పూర్‌లో అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దీంతో ఖరగ్‌పూర్‌ను ' మినీ ఆంధ్రప్రదేశ్' అని పిలుస్తారు. సుమారు లక్షన్నర మంది తెలుగు జనాభా అక్కడ నివసిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగును అధికార భాషగా గుర్తించాలనే వాళ్ల డిమాండ్‌ను పశ్చిమ బంగా ప్రభుత్వం ఆలకించింది. తెలుగును అధికార భాష చేయటంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ బంగా రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షల తెలుగు ప్రజలు ఉన్నారు. వారిలో సుమారు లక్షన్నర మంది ఖరగ్‌పూర్‌లో ఉంటున్నారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది ప్రజలు పశ్చిమ బంగాకు వలస వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. ముఖ్యంగా రైల్వే పనుల కోసం పశ్చిమ బంగాకు వలస వెళ్లారు.
చాలా కాలం తరువాత మా అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ సదుపాయాల పరంగా తెలుగువారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు... ఈ నిర్ణయంతో తెర పడుతుంది - తెలుగు సంఘం కార్యదర్శి బి సేథ్ గిరి రావు
ఖరగ్‌పూర్‌లో 35 శాతం మంది తెలుగు ప్రజలకు ఓటు హక్కు ఉంది. ఎన్నికలు కొన్ని నెలల్లో వస్తున్న నేపథ్యంలో.. తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి మమతా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భాజాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తృణమూల్.. భాజపా ఓట్లను తగ్గించలేదని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: