శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో పంచాయతీ ఎన్నికల విషయంలో జరిగిన ఘర్షణల వల్ల.. మాజీ సర్పంచ్ చిల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పైన విడుదలైన వారిని కళా వెంకట్రావు పరామర్శించారు. దాడుల్లో పాడైన సామగ్రితో పాటు పలువురి ఇళ్లలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను పరిశీలించారు. ఘర్షణలో దెబ్బతిన్న కారు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను భాదితులు ఆయనకు చూపించారు.
ప్రజలకు, కార్యకర్తలకు తెదేపా అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమాయక ప్రజలపై వైకాపా ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని.. కళావెంకట్రావు ఆరోపించారు. అధికార పార్టీతో సహా పోలీసులూ తగిన మూల్యం చెల్లిచుకోక తప్పదన్నారు. దుర్మార్గ, నిరంకుశ పాలనకు విసుగు చెందిన జనం.. ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. త్వరలోనే వైకాపాకు ప్రజలు విశ్రాంతిని ఇస్తారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: