కళా వెంకటరావు మీడియా సమావేశం ప్రస్తుత ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా కనబడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కళా...మూడు మాసాల్లో రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఏళ్ళు వెనక్కి వెల్లిపోయిందన్నారు. అమలుకాని హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు వైకాపా నాయకులు రాష్ట్ర అభివృద్ధితో ఆటలు అడుకుంటున్నారన్నారు. రాజధానికి తూట్లుపోడవడం మంచి పద్ధతి కాదన్నారు. అన్ని సౌకర్యాలు అమరావతికి ఉన్నా..రివర్స్ టెండర్ల పేరుతో వచ్చిన పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పనులమీద ఉన్న శ్రద్ధ పరిపాలనమీద లేదన్నారు. ఇదీ చూడండి:డిస్పెన్సరీకి అందించిన మందులు ఏమయ్యాయి? కార్మికశాఖ మంత్రి