శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాశీబుగ్గ రైల్వే మైదానంలో సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్... పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను సభాపతి తమ్మినేని సీతారాం, సహచర మంత్రులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఉద్దానం ప్రాంతంలో పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు, పలాసలో 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండీ... మంత్రి పేర్నినానికి.... ఆర్టీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానం