శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ప్రగడపుట్టుగలో శ్రీవెంకటేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో.. జరిగిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు ఇవాళ సాయంత్రం ముగిశాయి. బెందాలం ప్రకాశ్, వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 9 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో విశాఖపట్నం, విజయనగరం జట్లు తలపడ్డాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీపడగా.. విశాఖ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ పోటీలను తిలకించారు.
ఇదీ చూడండి:
మొదటి రోజు ముగిసిన పోలియో.. 1.49 లక్షల చిన్నారులకు వ్యాక్సినేషన్