ETV Bharat / state

వలస కూలీలకు కరోనా.. ఇచ్ఛాపురం సరిహద్దుల్లో ఆందోళన - శ్రీకాకుళం ఒడిశా సరిహద్దులో కరోనా

ఒడిశాకు సరిహద్దులు ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం గ్రామస్థులు కరోనా భయంతో ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలోని బ్రహ్మపురలో క్వారంటైన్​లో ఉన్న గుజరాత్ వలస కూలీలకు కొవిడ్ సోకడమే ఇందుకు కారణం.

icchapuram odisha boarder people tensed because of corona
వలస కూలీలకు కరోనా.. ఇచ్ఛాపురం సరిహద్దుల్లో ఆందోళన
author img

By

Published : May 9, 2020, 7:32 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి సరిహద్దులో ఉన్న ఒడిశాలోని బ్రహ్మపురలో క్వారంటైన్​లో ఉన్న వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఆందోళన మైదలైంది. సుమారు 40 మందికి పైగా గుజరాత్ నుంచి వచ్చిన కూలీలకు కొవిడ్ సోకింది. బ్రహ్మపూర్, ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాలోకి జనం వస్తున్నారని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

దీనిపై ఇచ్ఛాపురం సీఐ ఎం. వినోద్ బాబు స్పందిస్తూ.. ఒడిశా నుంచి రాష్ట్రానికి వచ్చే అన్ని మార్గాల్లో 12చోట్ల చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.

ఇవీ చదవండి.. ఉడికీఉడకని అన్నం పెడుతున్నారు సారూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.