శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానతో పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారులపై నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దాదాపు ఏడు గంటల పాటు కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది.
ఇవీ చదవండి..