ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం, పాతపట్నం ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గోకర్ణపురం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న గెడ్డ భారీ వరదతో ఉప్పొంగుతోంది. ఈ కాలువ దాటే ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.. ప్రమాదవశాత్తు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. పాతపట్నం సీఐ రవి ప్రసాద్... సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభ్యం కాలేదు.
మరొకరిని కాపాడిని స్థానికులు..
పాతపట్నం మండలం బూరగాం గ్రామానికి చెందిన మహేంద్ర తనయ... సమీపంలోని కాజ్ వేపై నడుచుకుంటూ వెళ్తుండగా... నదీ ప్రవాహం పెరిగడం వల్ల ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమీపంలో దహన సంస్కారాలు చేస్తున్న స్థానికులు గుర్తించి నది మధ్యలో ఉన్న అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించారు. అతన్ని ఆటోలో స్వగ్రామానికి పంపించారు.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక