శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో సామూహిక లక్ష కుంకుమార్చన కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. శానిటైజర్లను అందుబాటులో ఉంచి.. భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: