ఏపీ సైన్స్ కాంగ్రెస్‌కు శ్రీకారం
ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్‌కు ఈ సారి శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వేదికైంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేటి నుంచి శనివారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కులపతి హాదాలో సమావేశాలను ప్రారంభిస్తారని విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రామ్‌జీ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధన, సమకాలీన అంశాలపై అవగాహనకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అభివృద్ధి రంగాల కోసం సైన్స్ అనే అంశంపై ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అమరావతి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం
ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ నిర్మించిన నూతన భవనాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నారు. ఇక్కడ పది గదులను విద్యార్థులకు సౌకర్యవంతంగా నిర్మించారు. చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు తల్లిదండ్రుల పేరిట వితరణ చేసినట్లు దాత తెలిపారు.
అనంతరం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జిల్లా పర్యటన ముగించుకొని గవర్నర్ విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇదీ చదవండి :