శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గతేడాది మార్చిలో కరోనా వైరస్ బారిన పడిన సీతారామమ్మ.. 14 రోజుల్లోనే కోలుకున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య సూత్రాలను పాటించి మహమ్మారిని జయించారు. ఇప్పటికీ చలాకీగా జీవనం సాగిస్తున్న సీతారామమ్మకు నలుగురు సంతానం. గురువారం కుటుంబ సభ్యులు ఆమె శతాధిక జన్మదిన వేడుకలు సందడిగా నిర్వహించారు.
ఇదీ చదవండి: