శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని జోగంపేట ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని భుజంలోకి ఇనుప చువ్వ దూసుకెళ్లింది. దేవరశెట్టి లిఖిత అనే విద్యార్థిని యథావిధిగా బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లగా.. గేటు వేసి ఉన్న కారణంగాలోనికి వెళ్లలోకపోయింది. అది ఎక్కి లోపలికి ప్రవేశించే ప్రయత్నంలో.. గేటుకు అమర్చిన ఇనుప చువ్వలు బాలిక భుజంలోకి దూసుకెళ్లాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన యంత్రాలతో గేటు చివర కత్తిరించి బాలికను కాపాడారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు లిఖితకు శస్త్రచికిత్స చేసి ఇనుపచువ్వను బయటకు తీశారు. దాదాపు రెండు గంటలపాటు చిన్నారి నరకయాతన పడింది.
విద్యార్థిని భుజంలోకి ఇనుపచువ్వ.. 2 గంటలు నరకయాతన
పాఠశాల గేటు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నంలో బాలికకు ప్రమాదం జరిగింది. విద్యార్థిని భుజంలోకి గేటుకు ఉన్న ఇనుపచువ్వ దూసుకెళ్లింది. రెండుగంటల పాటు నరకయాతన పడ్డ లిఖితకు వైద్యులు శస్త్రచికిత్స చేసి.. ఉపశమనం కలిగించారు.