శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగాం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ట్యాంకర్ శ్రీకాకుళం నుంచి ఒడిశా వెళ్తుండగా పోలీసులు పహారా కాసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్యాంకర్లో భారీ మొత్తంలో సరుకు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రవాణా వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: