ETV Bharat / state

ఉధృతంగా వంశధార, నాగావళి నదులు - collector

ఒడిళాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని వంశాధార, నాగావళి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

గొట్టాబ్యారేజ్
author img

By

Published : Aug 7, 2019, 10:44 PM IST

ఉధృతంగా వంశధార, నాగావళి నదులు

ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి క్రమేపి నీటి ప్రవాహం పెరుగుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి మరింత వరద నీరు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. నాగావళి నదిలో కూడా వరద పోటెత్తుతోంది. భామిని మండలంలోని వంశధార పరివాహక ప్రాంతాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే కళావతితో కలిసి కలెక్టర్‌ నివాస్‌ పర్యటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు.

పొన్నాడ వద్ద నాగావళి నదిలో చిక్కుకున్న 14 మంది పశువుల కాపరులను అగ్నిమాపక సిబ్బంది రక్షించి.. ఒడ్డుకు తీసుకువచ్చారు. వరద ప్రవాహ నేపథ్యంలో పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో 4 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి.

గోదారి ఉద్ధృతి.. మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం

Intro:స్క్రిప్ట్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గ్రామ వార్డు వాలంటీర్లు వారధులుగా పనిచేయాలని ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పేదలకు సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికే చేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు సీఎం ఆశయ లక్ష్యానికి అనుగుణంగా వాలంటీర్లు వారికి కేటాయించిన 50 గృహాల వారికి అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను చీర వేయాలన్నారు ఎక్కడ అవినీతి చోటు లేకుండా ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో లో సంతృప్తి తీసుకోవాల్సిన బాధ్యత వాలంటీర్లేనన్నారు యువతకు ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత దేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు రాయచోటి పురపాలికలు 427 మంది వాలంటీర్లు అందుబాటులోకి వచ్చారని ఇప్పటినుంచి అభివృద్ధిని పరుగులు తీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అవినీతి జరిగినా నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఉత్తమ సేవలు అందించే వాలంటీర్లను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రోత్సాహాలు అందించడంతోపాటు శాశ్వత ఉద్యోగులుగా నియమించి బాధ్యత తీసుకున్నారు అనంతరం వాలంటీర్లకు నియామక పత్రాలతోపాటు సీఎం జగన్ శ్రీకాంత్ రెడ్డి ల చిత్రపటాలతో కూడిన జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమంలో పురపాలక కమిషనర్ మల్లికార్జున తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి వైకాపా నాయకులు పాల్గొన్నారు

Body:బైట్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వ చీప్ విప్

Conclusion:బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీప్ విప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.