ETV Bharat / state

సముద్రంలో బోటు గల్లంతు.. కోస్ట్‌గార్డ్‌ సాయంతో క్షేమంగా తిరిగి ఒడ్డుకు..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తీరప్రాంత గ్రామాలకు చెందిన 12 మంది మత్స్యకారులు.. చెన్నై సముద్రంలో గల్లంతైన ఘటన చివరికి సుఖాంతమైంది. ఇందులో ఉన్న 12 మంది ఆచూకీ తెలిసినట్లు అధికారులు వెల్లడించారు. బోటులో ఉన్నవారంతా జిల్లాలోని సోంపేట మండలం ఇసకలపాలెం, రామయ్యపట్నం, కవిటి మండలం కొత్తపాలెం, ఒడిశా సరిహద్దు సొన్నాపురం గ్రామాలకు చెందిన మత్స్యకారులు అని తెలిపారు.

author img

By

Published : Jul 20, 2021, 8:44 AM IST

FISHER MAN MISSING
కోస్ట్‌గార్డ్‌ సాయంతో క్షేమంగా ఒడ్డుకు

శ్రీకాకుళం జిల్లా నుంచి చెన్నై ప్రాంతానికి ఉపాధి కోసం పెద్దసంఖ్యలో మత్స్యకారులు వెళ్తుంటారు.ఈనెల 7న కొందరు ఓ బోటులో వేటకు వెళ్లారు. సాధారణంగా మూడు వారాల పాటు సముద్రంలోనే వేట సాగించి మత్స్యసంపదను తీసుకొస్తుంటారు. తీరం నుంచి సంబంధిత యజమాని వీరితో చరవాణి, వైర్‌లెస్‌ సెట్ల ద్వారా నిరంతరం మాట్లాడుతుంటాడు. 16వ తేదిన పడవలో ఉన్న మత్స్యకారులు యజమానితో మాట్లాడుతూ పడవలోకి నీరు చేరుతుందని ఇబ్బందుల్లో ఉన్నామని.. చెబుతుండగానే సంబంధాలు తెగిపోయాయి. చరవాణులు సైతం పనిచేయలేదు. దీంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

నాలుగు రోజులు దాటినా బోటుతో పాటు మత్స్యకారుల సమాచారం తెలియకపోవడంతో చెన్నైలోని వలస మత్స్యకారుల సంక్షేమ సంఘ నాయకులు సోమవారం తమిళనాడు మత్స్యశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువమంది సిక్కోలు వాసులే కావడంతో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు సైతం ఈ ఘటనపై స్పందించారు. తమిళనాడు, కేంద్ర మత్స్యశాఖ అధికారులతో మాట్లాడారు.

నావికాదళం గాలింపు చర్యలు చేపట్టడంతో సముద్రం మధ్యలో బోటు ఆచూకీ కనిపించింది. అంతా సురక్షితంగా ఉన్నారని తెలిసింది. బోటులో సాంకేతిక సమస్య వల్లనే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలిపారు. మత్స్యకారులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ను కలసి వినతిపత్రం అందించారు.

వేటకెళ్లిన మత్స్యకారుల్లో ఇసకలపాలెం గ్రామానికి చెందిన కోడ సోమేషు, కోడ జగన్నాథం, అంబటి నీలకంఠం, మోస సూర్యనారాయణ, రామయ్యపట్నం గ్రామానికి చెందిన నిట్ట జోగారావు, కవిటి మండలం కొత్తపాలెం, సొన్నాపురం గ్రామాలకు చెందిన కామేష్‌, రాజు, శివాజీ, బావయ్య, రవి, అప్పారావు, బాబు ఉన్నారు. నాలుగు రోజులుగా తమ కుటుంబసభ్యుల సమాచారం తెలియకపోవడంతో ఇక్కడివారిలో ఆందోళన నెలకొంది. జిల్లాకు చెందిన నాయకులు కూడా సోమవారం వేట నిలిపివేసి అధికారులు, నాయకుల చుట్టూ తిరిగారు. చివరికి కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

THOLI EKADASHI: తొలి ఏకాదశి అంటే ఏమిటి? విష్ణుమూర్తి ప్రసన్నం కావాలంటే ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.