అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆ శాఖ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్నిమాపక శాఖ అధికారి వై. గోవింద రావు ఆధ్వర్యంలో.. పట్టణంలోని కార్గిల్ కూడలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విన్యాసాలు చేశారు. బహుళ అంతస్తుల్లో జరిగే ప్రమాదాల నివారణకు అమలు చేసే కార్యాచరణను చేసి చూపించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. గృహాలకు నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలని సూచించారు. గ్యాస్ వినియోగంలో ముందస్తు జాగ్రత్తలు తప్పక వహించాలని కోరారు.
ఇదీ చూడండి: