శ్రీకాకుళానికి చెందిన జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రూ.50 లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వీర జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు సతీమణి నిరోషాకు కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్‌తో కలిసి కృష్ణదాస్ చెక్కును అందించారు.
ఏం జరిగింది..
లాన్స్‌నాయక్ హోదాలో.. లావేటి ఉమామహేశ్వరరావు 2020 జూలై 18న లద్దాఖ్‌లోని బటాలిక్ సెక్టార్‌లో టెర్రరిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తుండగా.. బాంబు పేలి వీర మరణం పొందాడు. దీంతో జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.50 లక్షలను విడుదల చేశారని ధర్మాన పేర్కొన్నారు. అలాగే దేశ భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ కుటుంబానికి అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
పరిహారం అందిందిలా..
జవాన్‌కు భార్య నిరోష, 11 ఏళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినందున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆదుకోవాలంటూ గతేడాది డిసెంబరులో నిరోష ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సీఎంవో ఈ ఏడాది జనవరిలో జిల్లా అధికారుల నుంచి విచారణ నివేదిక కోరింది. ఆస్తిపాస్తుల్లేని ఆ కుటుంబాన్ని సీఎంఆర్‌ఎఫ్ కింద ఆదుకోవాలంటూ అప్పటి శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రతిపాదించారు. ఇప్పటికి ఆ కుటుంబానికి పరిహారం అందింది.
ఇదీ చదవండి: