శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పెరిగిన విద్యుత్ బిల్లులతో వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. గత బిల్లుల కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వాపోతున్నారు.
ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా శ్లాబ్ రేట్లు పెంచలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం అపోహే అన్నారు. వినియోగం పెరిగి.. బిల్లులు ఎక్కువగా వస్తున్నట్టు చెప్పారు.