శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అత్యవసర, నిత్యావసర సరుకుల వర్తకులతో కలెక్టర్ నివాస్ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. సరుకులను ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవచ్చని తెలిపారు. దుకాణాల వద్ద ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అధిక ధరకు సరుకులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం, నరసన్నపేటలో పోలీసు పహారాలో లాక్‌డౌన్ ప్రక్రియ కఠినంగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చి వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. భాద్యతారహితంగా తిరుగుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని ప్రధాన మార్గాలన్నీ మూతపడుతున్నాయి. ముళ్లకంచెలు, వాహనాలను అడ్డంగా ఉంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాలంటూ దండోరా వేయిస్తున్నారు.
ఇదీ చదవండి: