ETV Bharat / state

'నాలుగో దశ పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలి' - శ్రీకాకుళం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ న్యూస్

శ్రీకాకుళం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు జాగరూకతతో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. ఈ సందర్భంగా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

District Joint Collector's instructions on the fourth phase panchayat election polling process in Srikakulam district
'నాలుగో దశ పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి'
author img

By

Published : Feb 18, 2021, 10:56 PM IST

పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు ఎన్నికల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విధులపై అవగాహన కల్పించారు.

మూడు దశల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా జరిపించమని.. నాలుగో విడతనూ.. అదే రీతిలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజు ఎన్నికల సిబ్బంది మండల కేంద్రాల వద్దకు చేరుకుని సామగ్రిని తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక అధికారి ఆర్ వెంకటరమణ, ఎంపీడీవో రవికుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.