శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. ఐదు మండలాలకు చెందిన 4,500 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. పేదలందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో.. సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె అన్నారు. పట్టాలు పొందలేని అర్హులు.. దరఖాస్తు చేసుకుంటే తొంభై రోజుల్లో మంజూరు చేస్తామని తెలిపారు. విడతలవారీగా పట్టాల పంపిణీ చేపడతామని హౌసింగ్ ఈఈ రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
టెక్కలి:
పేదవారికి సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇచ్చిన మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. పేదవారికి స్థలాలు అందకుండా చేసేందుకు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: