ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీ - Distribution of essential goods in ananthapuram district

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, పారిశుద్ద్య కార్మికులకు పలు జిల్లాలో దాతలు, స్వచ్చంధ సంస్థలు, నాయకులు కూరగాయలు , నిత్యావసర సరకులను పంపిణీ చేేశారు.

Distribution of essential commodities in various districts throughout the state
శ్రీకాకుళం జిల్లా గీతనాపల్లి గ్రామంలో నిత్యాావసర సరకుల పంపిణీ
author img

By

Published : May 15, 2020, 12:28 PM IST

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనాపల్లి గ్రామంలో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేపట్టారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వంగర మండలం, గీతనాపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నెయగాపుల శివరామ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో 250పేద కుటుంబాలకు ఉత్తరావెల్లి బ్రదర్స్ - ఉత్తరావెల్లి గణేష్ బెనర్జీ, సురేష్ ముఖర్జీ, సప్తగిరి ఛటర్జీ ఆర్ధిక సహాయంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా చోడవరంలో కోవిడ్-19 ను దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు శానిటైజర్లు, సబ్బులను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అందజేశారు. వీటితో పాటు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అయిదు కుటుంబాలకు చెందిన నామినీలకు రూ.11.30ల చెక్కు లను ఎమ్మెల్యే స్థానిక ఎంపీడీవో కార్యాలయ అవరణలో పంపిణీ చేశారు. తహశీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్యామ్, ఆదినారాయణ(వెలుగు), గోవింద(ఉపాధి), వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సింగరావు, మారిశెట్టి శ్రీ కాంత్, ఓరుగంటి నెహ్రు బాబు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వికలాంగుల సంఘం, మరియు ఏల్చూరు యువకుల ఆధ్వర్యంలో అద్దంకి నుంచి నార్కెట్​పల్లి రాష్ట్ర రహదారిపై వెళ్లే సుమారు 200 మంది వాహన చోదకులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూటూరి రామయ్య, వల్లెం వెంకట్రావు, నక్క కొండలు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం నేతలు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. పేరాలలోని ఐదవ వార్దు లో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సూరగాని లక్ష్మి , నరసింహారావు దంపతులు విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కూలీలు పనులు లేక వారి స్వగ్రామం పోయేందుకు రోడ్డు మార్గం వస్తుండగా ఓబులవారిపల్లి ఎస్సై వారందరినీ ఒక చోట చేర్చి స్థానిక వైసీపీ నాయకుడు భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 31 మంది యూపీ కి చెందిన వలస కూలీల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పాటు వారు ఉండేందుకు వసతులు కూడా ఏర్పాటు చేశామని ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు.

విజయనగరం జిల్లాలో...

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొప్రైటర్ సుబ్బరాజు, అమలోద్భవి హోటల్ ప్రొప్రైటర్ ప్రశాంత్ గత వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల కు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో...

కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా నార్పల మండలంలో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి మాస్కులు, కూరగాయల పంపిణీ చేపట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి, ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామాల్లో చేనేత కార్మికులకు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలులో ఉండటంతో చేనేత కార్మికులకు కనీస ఉపాధి కూడా లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటుచేసిన పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు అవకాశం లేకపోయిందని చెప్పారు.

ఇదీ చూడండి:విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.