శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని... సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖ మెట్రోపాలిటిన్ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో దృక్పథ ప్రణాళికపై... బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలన్నీ ప్రణాళికలో పొందుపర్చాలని సభాపతి అధికారులకు సూచించారు. రవాణా, పర్యటక రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడారు. దృక్పథ ప్రణాళిక జనవరి నాటికి, మాస్టర్ ప్రణాళిక జూన్ నాటికి తయారుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి