విద్యార్థి దశ నుంచే ఉన్నతంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(director SS Rajamouli). జీవితంలో ముందడుగేస్తేనే విజయం సాధించగలమని స్పష్టం చేశారు. శనివారం రాగోలు జెమ్స్ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఎప్పుడైనా మన పని నిబద్ధతతో చేసుకుంటూ వెళితే ప్రతిఫలం లభిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువురి ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చారు.
విద్యార్థి: సినీ పరిశ్రమలో మీరే ఎక్కువ విజయాలు అందుకుంటున్నారు. అందుకు కారణం?
రాజమౌళి: విజయం కావాలంటే తగిన ప్రయాణం అవసరమని నమ్ముతాను. ఏ కథ అయినా నన్ను ప్రేరేపించాలి. అప్పుడే తీస్తాను.
విద్యార్థి: దర్శకుడు కాకపోయి ఉంటే ఏమయ్యేవారు?
రాజమౌళి: నాకు డ్రైవింగ్ వచ్చు. దర్శకుడిని కాకపోయి ఉంటే డ్రైవరే అయ్యేవాడినేమో.
విద్యార్థి: చిన్నపిల్లలు చూసే చిత్రాలు తీస్తారా?
రాజమౌళి: బాహుబలి అంత పెద్ద హిట్ కావడానికి ఓ కారణం చిన్నపిల్లలూ చూడటమే. పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలు చూసే సినిమాలు తీయాలనేది నా కోరిక. అలానే తీస్తున్నానని అనుకుంటున్నా.
విద్యార్థి: మీ కలల ప్రాజెక్టు మహాభారతం ఎప్పుడు ప్రారంభిస్తారు?
రాజమౌళి: మహాభారతం తీయాలంటే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ప్రస్తుతం నేను తీస్తున్న ప్రతి సినిమాలోనూ సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మనసులో ఉన్న విజువల్స్ తెరపై చూపించగలననే విశ్వాసం వచ్చినప్పుడు మొదలుపెడతాను
విద్యార్థి: మీరు ఈ స్థాయికి వస్తారని ముందే ఊహించగలిగారా?
రాజమౌళి: శాంతినివాసం చేస్తున్న సమయంలోనే నాకు ఎందుకో అనిపించింది. పదేళ్ల తర్వాత కచ్చితంగా ఒక పెద్ద దర్శకుడిని అవుతాను అని..
విద్యార్థి: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా(rrr) లో జూనియర్ ఎన్టీఆర్(ntr)ను తెరపై 30 నిమిషాలే చూపిస్తారట? నిజమేనా?
రాజమౌళి: జూనియర్ ఎన్టీఆర్‌ను 30 నిమిషాలు చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా...
విద్యార్థి: పవన్‌కల్యాణ్(pawan kalyan)తో సినిమా ఎప్పుడు తీస్తారు?
రాజమౌళి: పవన్‌తో సినిమా తీయాలని ఎంతోకాలం నుంచి చూస్తున్నా. ఒకసారి కలిశాను. తర్వాత మరోసారి షూటింగ్‌లో కలిశాను. సమయం ఇస్తే కథ చెబుతా అన్నాను. ఏడాదిన్నర చూశాను. ఎలాంటి కబురు రాలేదు. ఆయన వేరే సినిమాల్లో బిజీ అయ్యారు. నేనేమో భారీ సినిమాలవైపు వెళ్లాను. పవన్ రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇద్దరం వేర్వేరు మార్గాల్లో ఉన్నాం.
ఇదీ చదవండి