శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన ఎలమంచిలి ధనలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అనంతరం ఇచ్ఛాపురం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో 108 వైద్య సిబ్బంది తమ నైపుణ్యం ప్రదర్శించి మహిళకు ప్రసవం చేయించారు. గర్భిణీ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను ఇచ్ఛాపురం ఆసుపత్రికి తరలించారు. ఎంతో చాకచక్యంగా, వృత్తి నైపుణ్యంతో గర్భణీకి ప్రసవం చేయించిన 108 సిబ్బందిని ఈఎం ఉప్పాడ గోపాలకృష్ణ, పైలెట్ వసంత గోవిందరావును గర్భిణీ బంధువులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది అభినందించారు.
ఇదీ చదవండి :