ETV Bharat / state

Death of Migratory birds : వలస పక్షుల మృత్యుఘోష... ఒక్క నెలలోనే వంద మృతి

Death of Migratory birds : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నెల వ్యవధిలోనే 100 పక్షులు నేలరాలాయి. పక్షుల మరణాలకు కారణాలు ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించలేకపోతున్నారు.

foreign birds
foreign birds
author img

By

Published : Jan 31, 2022, 4:37 AM IST

Death of Migratory birds : విదేశీ పక్షుల విడిది కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని తేలినీలాపురంలో వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నెల వ్యవధిలోనే 100 పక్షులు నేలరాలాయి. ఏటా అక్టోబరులో సైబీరియా నుంచి తేలినీలాపురానికి వచ్చే పెలికాన్‌ పక్షులు ఏప్రిల్‌ వరకు ఇక్కడ ఉంటాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈసారి దాదాపు 336 పెలికాన్‌ పక్షులు తేలినీలాపురం వచ్చాయి. 168 చోట్ల గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెట్టాయి. అయితే తల్లి పక్షుల్లో 100కు పైగా చనిపోయాయి. పిల్ల పక్షులతో కలిపి ప్రస్తుతం దాదాపు 330 మాత్రమే ఉన్నాయి. డిసెంబరు 26న తొలిసారి రెండు పక్షులు మృతిచెందడం అధికారులు గమనించారు. ఇప్పుడు రోజుకు ఐదు నుంచి పది చొప్పున నేలరాలిపోతున్నాయి. పక్షుల మరణాలకు కారణాలు ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించలేకపోయారు.

...

వైపరీత్యాలెన్నో ఎదుర్కొని..

మూడు దశాబ్దాల కిందట తేలినీలాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి చెట్లన్నీ కాలిపోయినా ఆ ప్రాంతంతో తమ అనుబంధాన్ని పెలికాన్‌ పక్షులు వదులుకోలేదు. 2014లో హుద్‌హుద్‌ తుపాను, 2018లో తిత్లీ తుపానుకు వృక్షాలన్నీ నేలకొరిగినా మోడువారిన చెట్లపై జీవించాయే తప్ప, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోలేదు. అక్కడికి రాకుండా ఆగలేదు. అలాంటి అతిథుల్ని కాపాడుకొనే చర్యలను అధికారులు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వైఖరితో పర్యాటక శోభకు తీరని మచ్చ ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కారణాలు అంతుచిక్కడం లేదు..

పెలికాన్‌ పక్షుల సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పక్షులు సమీప చెరువుల్లోని చేపల్ని తింటున్నాయి. ఆ చేపల్లో నులిపురుగులు ఉండటంతో విహంగాల జీర్ణవ్యవస్థ పాడై మృతి చెందుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. యానిమల్‌ డిసీజ్డ్‌ డయాగ్నస్టిక్‌ లేబరేటరీ అధికారులు సూచించిన మందులు కిందపడిపోయిన పక్షులకు ఇస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా మృత్యుఘోష ఆగడం లేదు.

- పీవీ శాస్త్రి, అటవీశాఖ రేంజర్‌, టెక్కలి

ఇదీ చదవండి : చల్లనాయుడు వలసలో మృత్యువాత పడుతున్న సైబీరియా పక్షులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.