వైఎస్సార్ నవశకం పేరుతో తమ భూములు తీసుకోవడాన్ని వెంటనే మానుకోవాలని శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి తమ భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలోని 18 వందల ఎకరాల భూములను అధికారులు సేకరించారని.. అందులో ఎస్సీల భూములతో పాటు ఆదివాసీల భూములు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని... లేదంటే.. కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: