శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో... తెదేపా, భాజపా నాయకులు పేదలకు సరకులు పంపిణీ చేశారు. మండలంలోని బొంతుపేట, పిన్నింటిపేట, బోరపేట గ్రామాల్లో తెదేపా నాయకులు బొంతు వెంకటరమణ మూర్తి, భాజపా నాయకులు ఐ.శ్రీనివాసరావు సుమారు 400 కుటుంబాలకు 8 రకాల నిత్యావసర సరకులతో పాటు గుడ్లు, సబ్బులు అందించారు. అలాగే పైడావలస గ్రామంలో జనసేన నాయకులు 150 కుటుంబాలకు సరకులు ఇచ్చారు.
ఇవీ చదవండి.. 'సోమశిల నిర్వాసితులకు పరిహారంలో భారీ అవినీతి'