శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పెద్దసమలపురం గ్రామ సమీపంలో వంశధార నది సమీపంలో ఉన్న 15 ఎకరాల జీడి మామిడి తోట దగ్దమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నది ఒడ్డున వరిగడ్డి కాల్చడంతో ఈ ప్రమాదం సంభవించిందని రైతులు చెబుతున్నారు. 15 మంది రైతులకు చెందిన తోటలు పూర్తిగా కాలిపోగా.. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది తోట పంట బాగుందని తీరా కాపుకొచ్చే సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం