ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్​ - రాజాంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం న్యూస్

ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనాను అరికట్టేందుకు టీకా వినియోగంలోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 18 కేంద్రాల్లో వ్యాక్సిన్​ను అందించారు. ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రజాప్రతినిదులు, అధికారులు ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినైజేషన్ ప్రారంభం..

author img

By

Published : Jan 16, 2021, 2:22 PM IST

Updated : Jan 16, 2021, 5:16 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో పలువురికి టీకాలు వేశారు.

శ్రీకాకుళం జీజేహెచ్​లో..

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ నివాస్​లు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్ పంపిణీ ప్రక్రయ విజయవంతం కావాలని ఆకాక్షించారు.

టెక్కలిలో..

టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో శాస్తవ్రేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి, అందించారని మంత్రి అన్నారు. ఇదొక చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. కరోనా కష్టకాలంలో వ్యాధిని వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలకు కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి అని అన్నారు. ప్రజలు నిర్భయంగా, అపోహలకు తావు లేకుండా టీకా వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలువురు అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

నరసన్నపేటలో..

నరసన్నపేటలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఘన విజయమని కృష్ణదాస్ అన్నారు.

పాలకొండలో..

పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, డీసీసీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి వ్యాక్సిన్​ను ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ నర్స్ సోఫియా వేసుకున్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో..

పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ప్రారంభించారు. అతనితో పాటు సీనియర్ వైద్యులు వేణుగోపాల్, వైద్య సిబ్బంది వ్యాక్సిన్​ వేసుకున్నారు. ఇప్పటివరకు 20 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.

రాజాం నియోజకవర్గంలో..

రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, రాజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు వందమందికి వ్యాక్సిన్​ వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

ఇచ్ఛాపురం పీహెచ్​సీలో..

ఇచ్ఛాపురం పీహెచ్​సీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. పది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు టీకా రావటం శుభపరిణామమని సాయిరాజ్ అన్నారు. మొదటి విడతగా ఆరోగ్య సిబ్బందికి.. రెండో విడతగా పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి అందిస్తారని తెలిపారు. ఇంకో ఆరు నెలల్లో విడతలవారీగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!

Last Updated : Jan 16, 2021, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.