ETV Bharat / state

సిక్కోలును తాకిన కరోనా.. జిల్లాలో 5కు పెరిగిన కేసులు

author img

By

Published : Apr 29, 2020, 7:19 PM IST

శ్రీకాకుళం నగరంలో కరోనా మొదటి కేసు నమోదైంది. ఇప్పటికే జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 5కు పెరిగింది. నగరంలో కొవిడ్ కేసు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. భద్రత పెంచి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.

covid positive  case in srikakulam
శ్రీకాకుళంలో మొదటి కరోనా కేసు

శ్రీకాకుళం నగరంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇటీవల దిల్లీ నుంచి వచ్చిన ఓ యువకునికి కొవిడ్ 19 నిర్ధరణ అయ్యింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ వ్యక్తి నివాసం ఉన్న పీఎన్‌ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అక్కడెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసు నేపథ్యంలో... అనుమానితులను కరోనా పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వేకు కలెక్టర్‌ ఆదేశించారు. పాతపట్నం మండలంలో శనివారం నమోదైన 4 పాజిటివ్‌ కేసులతో కలిపి.. జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 5కు చేరింది.

ఇవీ చదవండి:

'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.