శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కొవిడ్ విభాగం.. కొవిడ్ ట్రైఏజ్ ఏరియాలో మంచంపై ఓ మహిళ పడుకున్నట్లే ఉంది. ఆ ఎదురుగానే పీపీఈ కిట్లు ధరించి వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నమోదు వివరాలు సేకరిస్తున్నారు. మంచం మీద ఉన్న మహిళ మరణించినట్లు గమనించిన ఈనాడు ఫొటో గ్రాఫర్ ఆ దృష్ట్యాలను ఫొటోలు తీశారు. దీంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమై కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మృతిరాలికి ప్రత్యేక సూట్ వేసి శవాగారానికి తరలించారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని చీఫ్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. ఆమె ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు