ETV Bharat / state

జిల్లా వాసులను కలవరపెడుతున్న కరోనా..6వేల దాటిన కేసులు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నానాటికీ కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరగటం సర్వత్రా ఆందోళన రేపుతోంది. రోజుకు సగటున వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం 586 నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 6168కు చేరుకుంది.

corona cases in srikakulam dst are increasing number cross to six thousand

author img

By

Published : Jul 31, 2020, 11:33 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని పట్టణాల్లో అన్ని వీధులు కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్తున్నాయి. గ్రామాల్లో కూడా కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడటం అందరినీ కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో వైరస్ నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేయడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు.

రోజుకు సగటున 4 వేల పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 24 గంటల వ్యవధిలోనే ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ ఫలితాల్లో జాప్యం వస్తేనే వందలాది కేసులు బయటపడగా పరీక్షలు వేగవంతం చేస్తే బాధితులు ఎక్కువగా వెలుగుచూసే అవకాశముంది.

ఎటువంటి లక్షణాలు కనిపించినా ప్రజలే స్వచ్ఛందంగా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ నివాస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కిట్లు, సరికొత్త యంత్రాలు జిల్లాకు చేరుకోవడంతో నిర్ధరణ పరీక్షలు ఊపందుకున్నాయి. యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

కొవిడ్ కేర్‌ సెంటర్లలను ఏర్పాటు చేసింది. అన్ని వసతులు ఉంటే హోం ఐసోలేషన్‌ల్లో వైద్యం అందించేందుకు నిర్ణయించింది. కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వీడీఆర్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇక్కడ రోజుకు రెండు వేల నమూనాలను పరీక్షించే సామర్థ్యం మాత్రమే ఉండడం.. అంతకుమించి నమూనాలు సేకరిస్తుండటంతో ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

వైరస్ బాధతులు.. వారి కుటుంబసభ్యుల ఆందోళన దృష్ట్యా కలెక్టర్‌ నివాస్‌ ప్రస్తుతమున్న వీడీఆర్ ల్యాబ్‌కు అనుబంధంగా మరో ల్యాబ్‌ ఏర్పాటు చేసి పరీక్షల నాలుగు వేలకు పెంచే దిశగా చర్యలు చేపట్టారు. అలాగే మరోవైపు జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో పోష్టుల భర్తీ యుద్దప్రాతిపదకన చేస్తున్నారు.

కొవిడ్ మహమ్మారిని ఎదుర్కునేందుకు జిల్లాలో 8000మందికి సరిపడా సౌకర్యాలు ఉండేలా జిల్లా కలెక్టర్ నివాస్ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్నీ వసతులను కొవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చుతున్నారు. కనీసం 3000 మందిని హోం ఐసోలేషన్‌లో పెట్టి చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13 89 మంది.. కొవిడ్ కేర్ కేంద్రాల్లో 757 మంది.. కొవిడ్ ఆసుపత్రుల్లో 641 మంది మాత్రమే ఉన్నారు. కొవిడ్ ఆసుపత్రుల్లో 18 వందల పడకలు ఉన్నప్పటికీ.. వాటిలో కేవలం 30 శాతం పడకలు మాత్రమే నిండాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రాజాం, పాలకొండ ఏరియా ఆసుపత్రుల్లో వంద పడకలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 105 పడకలు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రైవేటు ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి జెమ్స్‌లో ప్రస్తుతం ఉన్న 50 ఐసీయు బెడ్లను 80కు పెంచుతున్నారు. తద్వారా 150 ఐసీయు పడకలు అందుబాటులో ఉంటాయి.

జిల్లాలో ఇప్పటి వరకు 1,53,607 మందికి నమూనాలు సేకరించామని కొవిడ్ జిల్లా నోడల్ అధికారి చెబుతున్నారు. కొవిడ్ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

అంబులెన్సుల సిబ్బందీ కరోనా బాధితులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.