కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, అవగాహనతోనే కరోనాను నియంత్రించవచ్చునని శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పట్టణ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా రెండో దశ ప్రారంభమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కు తప్పని సరిగా ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో కరోనా నియంత్రణకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి...: ప్రజా పోరాటాలతోనే పరిష్కారం దొరుకుతుంది:ఆర్.నారాయణమూర్తి