గుంటూరులో
పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ... గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి హిందూ కళాశాల కూడలి వరకు సిలిండర్ మోస్తూ... మోకాళ్లపై నడుస్తూ... నిరసన తెలిపారు. అనంతరం పెట్రోల్ బంక్ ఎదుట నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ , నిత్యావసర సరుకులు ధరలను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రజల రక్తాన్ని పన్నులు రూపంలో పీల్చుకుంటుదన్నారు.
తక్షణమే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలను నియంత్రించాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అన్నారు. తక్షణమే పెంచిన ధరలను నియంత్రించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో..
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. స్థానిక పెట్రోల్ బ్యాంకు వద్ద పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ.. వినియోగదారుల నుంచి సంతకాలు సేకరించారు. ఎన్నడూ లేని విధంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దారుణంగా పెంచుతుపోతున్నారని... గృహ వినియోగదారులపై గ్యాస్ భారం వేశారని నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేయడం ఆపి.. జీఎస్టీ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చింతాడ దిలీప్ కుమార్, అసంఘటిత రంగ కార్మికుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాస్కర్ బాబు, డాక్టర్స్ సెల్ కన్వీనర్ కవిటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
visakha steel plant: సీఎం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలి: నారాయణ