ETV Bharat / state

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - collecting signatures latest

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మండిపడ్డారు.

Congress leaders
కాంగ్రెస్ నాయకులు
author img

By

Published : Oct 29, 2020, 4:24 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న రెండు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మండిపడ్డారు. ఈ సంతకాలను రైతులకు మద్దతుగా సేకరిస్తున్నామని తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, సనప అన్నాజీ రావు తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆ విద్యా సంస్థలకు రూ.150 కోట్ల అక్రమాస్తులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.