శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గస్థాయిలో జరిగిన ఉపాధి హామీ పనులపై కలెక్టర్ జె. నివాస్ సమీక్ష నిర్వహించారు. ఆర్బీసీ కేంద్రాలు, వైస్సార్ హెల్త్ క్లినిక్, సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. లక్ష్మీ నర్సంపేట, పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లో ఇసుక అందుబాటులో ఉండటం లేదని నిర్మాణదారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని వివరించారు.
నిర్మాణం పూర్తయిన పనులకు బిల్లులు అందేలా చేస్తామని జిల్లా పాలనాధికారి అన్నారు. సచివాలయ భవనాలకు స్థలాలు సేకరించి..త్వరగా నిర్మాణాలు చేపట్టాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ పాలనకు త్వరలో చరమగీతం: ఎంపీ రామ్మోహన్