శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేసుపురంలో పిడుగుపాటుకు ఆరు కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు పిడుగులు పడడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గ్రామంలోని ఐదుగురు రైతులకు చెందిన కొబ్బరిచెట్లపై పిడుగుపడి దగ్ధమయ్యాయి. సోంపేట మండలం మామిడిపల్లిలోనూ పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది.
ఇదీచదవండి