తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడును నియమిస్తూ చంద్రబాబు ప్రకటన చేయడంతో అచ్చెన్న స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ కోలాహలంగా మారింది. తెదేపా ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అచ్చెన్న ఇంటికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నను నియమించటంతో జిల్లా తెదేపాలో నూతనోత్సాహం నిండిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: