ETV Bharat / state

నిబంధనలతో ప్రమిదల తయారీదారుల కష్టాలు - blacksmith faces difficulties due to corona effect news

దీపావళి పండుగ అంటే పెద్దలు, పిల్లలకు ఎంతో ఆనందం. మహిళలు ఇంటి నిండా దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించుకుంటారు. ఇందుకోసం ఆకర్షణీయమైన ప్రమిదలు ఉపయోగిస్తుంటారు. తయారీదారులకు ఈ సమయంలో చేతినిండా పనిదొరకటమే కాక, ఆదాయం కూడా ఉంటుంది. వినాయక చవితి, దీపావళి, కార్తీకమాసం కుమ్మరులు మట్టి వస్తువుల తయారీలో మునిగిపోతారు. కానీ కరోనా సమయంలో నిబంధనల కారణంగా వ్యాపారం అంతగా లేదని తయారీదారులు వాపోతున్నారు.

mud containers
మట్టి పాత్రలు, ప్రమిదల తయారీ
author img

By

Published : Nov 13, 2020, 2:56 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలం భద్రపురం గ్రామంలో ప్రమిదల తయారీదారుల కుటుంబాలు ఎక్కువ. వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే. దీపావళి పండుగ సమయంలో ఇప్పటికీ మట్టి పాత్రలనే ఉపయోగిస్తారు. అవసరాలకు అనుగుణంగా ఏడాది పొడవునా మట్టిపాత్రలు, ఇతర వస్తువుల తయారీలో నిమగ్నమై ఉంటారు.

దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి వేడుకలకు మూడు నెలల ముందు నుంచే మట్టి పాత్రలు తయారు చేస్తారు. చెరువుల నుంచి సేకరించిన బంక మట్టితో రకరకాల కుండలు, కట్టె పొయ్యిలు, బొగ్గుల కుంపట్లు, వంటపాత్రలు, దీప ప్రమిదలు లాంటి రకరకాల వస్తువులు తయారు చేసి అమ్ముతుంటారు. ప్రమిదల ఆకారాలను బట్టి ధర నిర్ణయిస్తారు. బంకమట్టితో తయారు చేసిన వాటిని ఎండబెట్టి..గట్టి పడిన తరువాత గడ్డి, కర్రలతో కాలుస్తారు. అనంతరం వాటిని చక్కగా అలంకరించి విక్రయిస్తారు.

"ఏరులోని బంకమన్ను తెచ్చి ప్రమిదలు తయారు చేశాం. ఏటా లక్షల్లో మట్టి వస్తువులు చేసేవాళ్లం. వ్యాపారం బాగుండేది. ఈసారి కరోనా కారణంగా కొనుగోలుదారులు అంతగా లేరు. తయారు చేసిన ప్రమిదలను ఊరురా తీసుకెళ్లి అమ్ముతున్నా అంతగా ఆదాయం లేదు" -తయారీదారుడు

ఇదీ చదవండి: 'అంతే లేకుండా దోపిడీ.. అడ్డే లేకుండా అప్పు.. ఇదీ జగన్ పాలన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.