ETV Bharat / state

'సీఎం ఆకాశంలోనూ.. మాజీ సీఎం వెబ్​ జూమ్​లోనూ రాజకీయం చేస్తున్నారు' - సీఎంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు

ఏపీ సీఎం ఆకాశంలోనూ.. మాజీ సీఎం వెబ్ జూమ్​లోనూ రాజకీయాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అమరావతిలో 65వేల మంది రైతులకు పట్టాలు ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని తెలిపారు.

somu veerraju
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
author img

By

Published : Aug 21, 2020, 6:54 AM IST

ఆంధ్రప్రదేశ్​లో భాజపా వాస్తవిక రాజకీయ నిర్మాణం చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయాన్ని సోము వీర్రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము రాజకీయాలను భూమి మీద నడుపుతున్నారనీ.. గోదావరి వరద ప్రాంతంలో పర్యటించటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కానీ ఏపీ సీఎం ఆకాశంలోనూ.. మాజీ సీఎం వెబ్ జూమ్​లోనూ రాజకీయం చేస్తున్నారంటూ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టేయటం మంచిది కాదని హితవు పలికారు. అమరావతిలో 65 వేల మంది రైతలకు పట్టాలు ఇవ్వాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. మీరేం చేశారంటూ కేంద్రాన్ని నిలదీయటం సరైనది కాదనీ.. 2024కి మాకు అధికారం ఇస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:

భాజపా ఎంపీ జీవీఎల్​పై ఫేస్​బుక్ పోస్టు... తెదేపా కార్యకర్తపై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.