ETV Bharat / state

భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం ఇదేనా..! - latest news on bhavanapadu port

శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా నిలవనున్న భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతంలో రిజర్వు ఫారెస్టు భూములు ఉన్నాయి. వాటిని తీసుకుంటేనే పోర్టు నిర్మాణం సాధ్యం అవుతుంది. లేదంటే భారీ ఖర్చు భరించక తప్పదని ఇప్పటికే అధికార, మేధావి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన అటవీ భూములను తీసుకోవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూ కేటాయింపులు చేసేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూసేకరణ అంశం ఓ కొలిక్కి వస్తేనే పోర్టు నిర్మాణానికి ముందడుగు పడనుంది.

bhavanapadu port
భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం
author img

By

Published : Jan 17, 2021, 4:55 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి విడతగా నిధులు కేటాయించింది. తొలుత భావనపాడు - దేవునల్తాడ మధ్యలో పోర్టు నిర్మించాలనుకున్నారు. దానికి అనేక అడ్డంకులు వచ్చిన నేపథ్యంలో భావనపాడు-మూలపేట మధ్యలో పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ప్రతిపాదిత ప్రాంతంలో రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాయి. ఈ క్రమంలో 335 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూములు ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిని 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులకు ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ భూములను తీసుకోవాలంటే వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు చూపించాల్సి ఉంది. దీనికోసం రెవెన్యూ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడినట్లు తెలుస్తోంది.

లొత్తూరు పరిధిలో రెవెన్యూ భూములు..!!

జిల్లాలోని పలాస మండలం లొత్తూరు గిరిజన ప్రాంతంలో రెవెన్యూ శాఖకు చెందిన సుమారు 2వేలు ఎకరాల భూములున్నాయి. ఇవన్నీ కొండవాలు ప్రాంతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల్లో ఇప్పటికే కొందరు గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొందరికి గతంలోనే డీ పట్టాలు కూడా మంజూరయ్యాయి. కొన్ని భూములు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 800 ఎకరాల భూమిని అటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంది. లొత్తూరు పరిధిలో ఉన్న భూముల్లో ఎక్కడివి అనుకూలంగా ఉంటాయి? వాటిని ఇవ్వాలంటే విధి విధానాలు ఏమిటి? ఏయే నిబంధనల ప్రకారం వెళ్లాల్సి ఉంది? తదితర అంశాలపై రెవెన్యూ శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ భూములను ఇటీవల రెవెన్యూ ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులు పలుమార్లు పరిశీలించారు.

ఇది సాధ్యమేనా...!

రిజర్వు ఫారెస్టు భూములను తీసుకోవడం వీలు కాక పోవచ్చనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పోర్టు నిర్మాణం కోసం కాబట్టి అవకాశాలు ఉండొచ్చంటున్నారు. ఈ చిక్కులు దాటితేనే పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరోవైపు అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని అనుకుంటున్న లొత్తూరు ప్రాంతాల్లో ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటూ, దానిపైనే ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వమే ఇచ్చిన డీ పట్టాలతో భూమిని సాగు చేసుకుంటున్న వారికీ ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులు కీలకంగా వ్యవహరిస్తే భూసేకరణ ఓ కొలిక్కి వచ్చి పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగుతాయి.

పరిశీలించారు...

లొత్తూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల పరిశీలించారు. అటవీశాఖ అధికారులు డిసెంబర్‌ లోనే ఈ భూములను పరిశీలించారు. ఆ భూములు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం కోసమేనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. ఉన్నతాధికారులు చూసి వెళ్లిన తర్వాత ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారమూ లేదు. - ఎల్‌.మధుసూదన్‌, పలాస తహసీల్దార్‌.

ఇదీ చూడండి:

విద్యుత్ టారిఫ్‌పై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.