ETV Bharat / state

నాడు ఇల్లే ప్రపంచం, నేడు విశ్వవ్యాప్తం - మోదీ మెప్పు పొందిన బెజ్జిపురం యూత్ - ప్లాస్టిక్ రహిత సమాజం

Bejjipuram Village Success Story: వారంతా ఒకప్పుడు ఇల్లే ప్రపంచంగా బతికిన ఇల్లాళ్లు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన నిరుపేద గృహిణులు. కానీ ఇప్పుడు వారు స్థానికంగా దొరికే గోగునార, కుట్టు నైపుణ్యంతో తలరాతలే మార్చుకున్న విజయ గీతికలు. ఈ గెలుపే తాజాగా తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసలు అందుకునేలా చేసింది.

Bejjipuram_Village_Success_Story
Bejjipuram_Village_Success_Story
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 8:04 AM IST

నాడు ఇల్లే ప్రపంచం, నేడు విశ్వవ్యాప్తం- మోదీ మెప్పు పొందిన బెజ్జిపురం యూత్

Bejjipuram Village Success Story: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం యూత్ క్లబ్ స్వయం ఉపాధి, మహిళా సాధికారతే లక్ష్యంగా వేలాదిమంది మహిళలకు గోగునారతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై నిలబడేలా చేస్తోంది. ఇక్కడి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఎంతోమంది మహిళలను వ్యాపారవేత్తలుగా మలుస్తోంది.

ప్రపంచం మొత్తం జపిస్తున్న ఆధునిక పర్యావరణ మంత్రం ప్లాస్టిక్ రహిత సమాజం. ఈ సూత్రాన్ని మూడు దశాబ్దాల క్రితమే ఆకళింపు చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యువకులు. మార్పు కావాలంటే మొదటి అడుగు మనమే వేయాలి. అదే అందరినీ అభివృద్ధి బాటలో నడిపిస్తుందని నమ్మడంతో పాటు బెజ్జిపురం యూత్ క్లబ్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సాగు కష్టాల నుంచి కుటుంబాలను గట్టెక్కించేందుకు గృహిణులకు చేయూతనివ్వాలనుకున్నారు. దానికోసం 1993లో 15 మంది మహిళలతో ఓ బృందం ఏర్పాటు చేశారు. వీరు మరో వంద మందిని చేర్చుకుని గాయత్రి యూత్ క్రాఫ్ట్ పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. వీరందరికీ యూత్ క్లబ్ సభ్యులు వివిధ రకాల చేతివృత్తుల తయారీలో శిక్షణ ఇప్పించడమే కాకుండా, గడప దాటి బయటకు రాలేని మహిళల కోసం ఇంటికి ముడి సరుకులు తెచ్చి ఇవ్వడం, తయారైన ఆ వస్తువులను సేకరించి మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను తీసుకున్నారు.

మహిళల ఉపాధికి భరోసానిస్తున్నసెంచూరియాన్​ విశ్వవిద్యాలయం

మొదట్లో సాంప్రదాయ శైలి ఊయలలు, చేతి సంచులు తయారు చేసేవారు. క్రమంగా ఆధునిక అవసరాలకు తగినట్లు ల్యాప్‌టాప్‌ బ్యాగ్లు, గృహోపకరణాలు, మ్యాట్లు లాంటి 80 రకాల వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ శెభాష్ అనిపిస్తున్నారు. దిల్లీ, ముంబయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరిగే జాతీయస్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. కొందరు సొంతంగా స్టోర్లను పెట్టి రాణిస్తున్నారు. తమ ఉత్పత్తులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

బెజ్జిపురం యూత్ క్లబ్ ద్వారా గోగునార ఉత్పత్తుల తయారీలో మాస్టర్ ట్రైనీలుగా మారిన బృంద సభ్యులు.. స్వయం ఉపాధి పొందడమే కాక ఆసక్తి ఉన్నవారికీ శిక్షణనిస్తూ ఉపాధి బాట పట్టించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. వారిలో 150 మందికి పైగా వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 769 మందికి హస్తకళలు, జూట్ క్రాఫ్ట్‌లతో బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చారు.

'గిరిజన యువత, మహిళలు స్వయం ఉపాధి సాధించాలి'

వేల మందికి గోగునార ఉత్పత్తుల్లో మాస్టర్ నైపుణ్యాలను అందించారు. యూత్ క్లబ్‌లో పనిచేసే మహిళలు నెలకు 10 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. నాబార్డ్‌, డీఆర్​డీఏ కేంద్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయంతో దేశవ్యాప్తంగా స్టోర్లు ఏర్పాటు చేసి ఏడాదికి 80 లక్షల రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నారు. వీటిలో కొంత మొత్తాన్ని క్లబ్ వసతులు మెరుగుపర్చుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్​పై నిషేధం విధించడంతో జనపనార సంచులు, బొమ్మలకు గిరాకీ పెరిగిందని క్లబ్‌ సభ్యులు చెబుతున్నారు.

బాల కార్మికులకూ నైపుణ్యశిక్షణనిస్తూ వారిని ఆ ఊబి నుంచి బయటపడేలా చేస్తున్నారు. రైతులకు నూతన నైపుణ్యాలను నేర్పించి స్వయం శక్తిమంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమాలే ప్రధానిని సైతం ఆకట్టుకునేలా చేశాయి. ఈ సంస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ నైపుణ్యాభివృద్ధికి దేశంలో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సామూహిక ప్రయత్నాలు అవసరమని బెజ్జిపురం యూత్ క్లబ్‌ని ప్రధాని మోదీ ప్రశంసించారు.

'ఆసరా, చేయూత లబ్ధిదారులకు స్వయం ఉపాధి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.