లాక్‌డౌన్ భారం నుంచి ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని తీసుకునేందుకు మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్ద జన్‌ధన్ ఖాతాదారులు బారులు తీరారు. జన్‌ధన్ ఖాతాల్లో 500 రూపాయలు, పీఎం కిసాన్ యోజన ఖాతాల్లో 2 వేల రూపాయలను కేంద్రం జమ చేసింది. ఆ మొత్తాన్ని తీసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బ్యాంకులన్నీ రద్దీగా మారాయి. మూడు రోజుల సెలవులు తరువాత బ్యాంకులు తెరవటంతో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులకు క్యూ కట్టారు. వీరు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్ వేళ తపాలా శాఖ 'ప్రేమానురాగాల' డెలివరీ!