శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పాతపట్నం సీఐ రవి ప్రసాద్ మాట్లాడుతూ... పాస్టిక్ సంచుల వినియోగం నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను వివరించారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలన్నారు. కాశీబుగ్గలోనూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
విజయనగరంలోనూ....
విజయనగరం జిల్లా రాంబద్రపురంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ శేషగిరిరావు మాట్లాడుతూ... మహిళల నుంచే మార్పు సాధ్యం అవుతుందని... ముందుగా వారే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి